ముగ్గురిని పెళ్లి చేసుకున్నా విడాకులిచ్చారన్న మనస్తాపంతో ఆత్మహత్య!

  • గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఘటన
  • మూడు నెలల క్రితం ముచ్చటగా మూడో పెళ్లి
  • ఆమె కూడా వెళ్లిపోయిందని ఉరేసుకున్న జితేంద్ర
తాను ముగ్గురిని పెళ్లి చేసుకున్నా, అందరూ విడాకులు ఇచ్చి దూరమయ్యారన్న మనస్తాపంతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన గుజరాత్ లోని అహ్మదాబాద్ లో జరిగింది. మరిన్ని వివరాల్లోకి వెళితే, జితేంద్ర పర్కార్ (34) అనే వ్యక్తి పాథాలజీ ల్యాబ్ లో ఆఫీస్ బాయ్ గా పనిచేస్తున్నాడు. ఇప్పటికే అతను రెండు పెళ్లిళ్లు చేసుకోగా, ఆ ఇద్దరూ అతనికి విడాకులు ఇచ్చి దూరమయ్యారు.

తాజాగా మూడు నెలల క్రితం మరో అమ్మాయిని జితేంద్ర వివాహం చేసుకోగా, ఆమె కూడా అతన్ని విడిచి వెళ్లింది. దీంతో తనకిక ఈ జీవితం అక్కర్లేదనుకున్న అతను, తాను పనిచేసే ల్యాబ్ లోనే ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న పోలీసులు, కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నట్టు తెలిపారు.
Go Back to Shorts
Gujarath
Ahmadabad
Sucide
Hand
Marriage
Divorce

More Telugu News